నాచురల్ స్టార్
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ.కి
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...
ప్రియాంక అరుల్
మోహన్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది.
ఎస్ జె సూర్య ఈ
మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇకపోతే ఈ
మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
కాకపోతే ఇదే తేదీన పుష్ప పార్ట్ 2
మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ప్రకటించింది. పుష్ప పార్ట్ 2
మూవీ కనుక విడుదల వాయిదా పడినట్లు అయితే ఆ తేదీనే సరిపోదా శనివారం సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఈ
మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల
థియేటర్ హక్కులను
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ఈ చిత్ర బృందం వారు ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నార్త్
అమెరికా థియేటర్ హక్కులను కూడా ఓ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ
మూవీ యొక్క నార్త్
అమెరికా హక్కులను ప్రత్యంగిరా సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను నార్త్ అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ
మూవీ పై
నాని అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.