బ్రేకింగ్: తల్లిదండ్రులు కాబోతున్న విరాట్-అనుష్క..!!
ఆ సమయంలో విరాట్ ఆమెకు తోడుగా ఉండాలనుకున్నారు.. అందుకే టెస్టుల నుంచి దూరమయ్యారని కూడా తెలిపారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో విరాట్ ను మెచ్చుకోవాల్సిందే.. ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేను అంటూ కూడా తెలియజేశారు. దీంతో అటు అనుష్క, విరాట్ అభిమానులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఇకపోతే అనుష్క విరాట్ 2013లో ఒక షాంపూ యాడ్ ద్వారా కలుసుకున్నారు. అప్పటినుంచి వీరి మధ్య మంచి సన్నిహిత సంబంధం మొదలై ఆ పరిచయమే ప్రేమగా మారి ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా జరిగింది వీరి ప్రేమ బంధానికి గుర్తింపుగా వామిక అనే కూతురు కూడా జన్మించింది. అప్పుడప్పుడు తన కూతురు ఫోటోలను సైతం సోషల్ మీడియాలో అనుష్క విరాట్ చూపిస్తూ ఉంటారు. వీరి పర్సనల్ విషయాలను కూడా చాలా రహస్యంగానే ఉంచాలని చూస్తూ ఉంటారు. మరి త్వరలోనే ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం అనుష్క శర్మ కూడా సినిమాలకు దూరంగానే ఉంటూ నిర్మాతగా కూడా మారినట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో కూడా ఆడుతూ బాగానే ఐపీఎల్లో కూడా ఆడుతూ తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు.