వామ్మో: కొడుకు కోసం కత్తిలాంటి ఫిగర్‌ను లైన్లో పెట్టిన సుమ..!!
ఇటీవల రోషన్ బబుల్ గమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా పర్వాలేదు అనిపించుకున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ నటుడుగా తన స్టామినా ఏంటో చూపించారు రోషన్.. అంతేకాకుండా తన నటన రొమాన్స్ తో యూత్ ని బాగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు మరొకసారి సరికొత్త మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు రోషన్.. అయితే ఈ సినిమా కోసం సుమ ఒక కత్తిలాంటి ఫిగర్ ను ఏరి కోరి మరి ఎంచుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమె ఎవరో కాదు బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్యతో రోషన్ రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సెకండ్ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవి చైతన్య తో సుమ సినిమాని ప్లాన్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఒకవేళ రోషన్, వైష్ణవి కాంబినేషన్లో సినిమా వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది. వైష్ణవి చైతన్య కూడా ఈ మధ్య పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.