వామ్మో: మహేష్ బాబు ధరించిన ఈ జాకెట్ ధర ఎన్ని లక్షలో తెలుసా..?

Divya

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇటీవల గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మహేష్ బాబు స్టామినా ఎంటో నిరూపించుకున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పనిచేసే విధంగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిమిత్తం జర్మనీకి వెళ్లిన మహేష్ బాబు అక్కడ ఒక డాక్టర్ని కలిసి ఫిట్నెస్ కు సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అలాగే రీసెంట్గా ట్రెక్కింగ్  చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు.


అయితే ఈ ఫోటోలలో మహేష్ బాబు డాక్టర్ తో కలిసి ఉన్నారు.ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో మహేష్ బాబు వేసుకున్న జాకెట్ గురించి అభిమానులు చాలా ఆరా తీశారు. అది ఏ బ్రాండ్ ఎంత ధర అనే విషయాన్ని ఆరా తీయగా.. డాక్టర్ హ్యారీతో కలిసి మహేష్ బాబు ఉన్న ఫోటోలలో మహేష్ బాబు ధరించిన జాకెట్  బ్రూనేల్లో కుసినెల్లి బ్రాండ్ కి చెందినదట.. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ దీని ధర అక్షరాల రూ .4 లక్షల రూపాయలట.


ఇది ఇటాలియన్ ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్ కు చెందినది ఇలా సింపుల్ గా కనిపించిన ఈ జాకెట్ ధర ఇన్ని లక్షలని తెలిసి అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే సెలబ్రిటీలు సైతం ఇలాంటి ఖరీదైన దుస్తులు ధరించడం సర్వసాధారణం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు ,రాజమౌళి సినిమా పనులలో చాలా బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక విషయంలో చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడు తెలియజేస్తుందో చూడాలి మరి. దాదాపుగా రూ .1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: