సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందించిన 'గుంటూరు కారం' సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ డ్రామా. ఈ చిత్రంలో మహేష్ మాస్ యాక్షన్ హీరోగా నటించారు. అతడి సరసన శ్రీలీల ప్రధాన కథానాయికగా నటించింది. మీనాక్షి చౌదరి ఒక కథానాయికగా నటించింది.ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, వెన్నెల కిషోర్ నటించిన 'గుంటూరు కారం' హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. థమన్ సంగీతం పాటలకు మిశ్రమ స్పందనలు వచ్చాయి.ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా కానీ, బాక్సాఫీస్ వద్ద చక్కని ఓపెనింగులు సాధించింది. ఎట్టకేలకు ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని 9 ఫిబ్రవరి 2024న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.
12 జనవరి 2024న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి ఇంకా కొంతమంది పెయిడ్ యూ ట్యూబర్లు, పెయిడ్ సైట్స్ నుంచి దారుణమైన నెగటివిటీ వచ్చింది. అయినా కాని గుంటూరు కారం సాలిడ్ వసూళ్ళని నమోదు చేసింది. అది కూడా కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా వల్లనే. సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తరువాత కూడా త్రివిక్రమ్ కానీ, ప్రొడ్యూసర్ నాగవంశీ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ ఈ సినిమాని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే తన పెర్ఫార్మన్స్ తో ఈ సినిమాని నిలబెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాడు.మహేష్ దయ వల్ల గుంటూరు కారం సినిమా 252 కోట్ల వసూళ్ళని వసూలు చేసింది.కానీ గుంటూరు కారం మేకర్స్ కి కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా ఈ సినిమాని 50 రోజుల పాటు రన్ చెయ్యకుండా అప్పుడే ఓటిటిలో విడుదల చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని, నాగవంశీని, తమన్ ని తిట్టిన తిట్లు తిట్టకుండా పచ్చి పచ్చిగా బూతులు తిడుతున్నారు.