ఏంటీ.. హనుమాన్ కోసం.. తేజ 75 సినిమాలు వదులుకున్నాడా?
స్టార్ హీరోలు అందరూ బరిలోకి దిగిన సంక్రాంతి బరిలోనే ఇక ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది. అయితే స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కినట్టు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకవైపు తేజ సజ్జకి మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కూడా ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా ఈ మూవీ కలెక్షన్స్ భారీగా సాధిస్తూ దూసుకుపోతుంది. అయితే ఇటీవలే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జ ఏకంగా 75 సినిమాలను వదిలేసుకున్నాడట.
ఈ ప్రాజెక్టులో నటిస్తున్నన్ని రోజులు మరో సినిమాకు ఓకే చేయలేదట తేజ. స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. హనుమాన్ సినిమా కోసం 25 సార్లు లుక్ టెస్ట్ చేశారట. ఈ సినిమాలో అన్ని తానే స్వయంగా చేశానని.. నీళ్లల్లో సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు తేజ. ఇక ఈ మూవీ తీయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ టైంలో తాను మరే సినిమాను ఓకే చేయలేదు. పూర్తిగా హనుమాన్ మీదే దృష్టి పెట్టాను. ఇక అప్పుడు దాదాపు 75 సినిమాల ఆఫర్లు వచ్చినా వదిలేసుకున్నాను. ఇక ఇంత కష్టపడినందుకు ఈ సినిమాకి వచ్చిన విషయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ తేజ చెప్పుకొచ్చాడు.