టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఇకపోతే ఈయన ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఈ సంవత్సరం
మార్చి 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ డిజె టిల్లు అనే
మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది.
డీజే టిల్లు
మూవీ సూపర్
సక్సెస్ కావడంతో టిల్లు స్క్వేర్
మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాతో పాటు సిద్దు "తెలుసు కదా" అనే మరో సినిమాలో కూడా
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో రాసి
కన్నా ,
నేహా శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఇలా ప్రస్తుతం రెండు
మూవీ ల షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ నటుడు కొన్ని రోజుల క్రితమే
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో కూడా ఓ
మూవీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువబడింది. ఈ సినిమాలో బేబీ
బ్యూటీ వైష్ణవి
చైతన్య హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రకటించారు. తాజాగా
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ వారు సిద్దు ... వైష్ణవి కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ ను రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ
సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో 37 వ
మూవీ గా రూపొందబోతున్నట్లు కూడా ఈ బ్యానర్ వారు అధికారికంగా ప్రకటించారు.