షారుక్ ఖాన్, సందీప్ వంగ మధ్య మాటల యుద్దం?

Purushottham Vinay
షారుక్ ఖాన్ - సందీప్ రెడ్డి మధ్య అప్పుడే మాటల యుద్దం స్టార్ట్ అయిందని తెలుస్తోంది.ఇంతకీ ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? అందుకు కారణాలు ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో? అంతకు మించి పాత్రల పరంగా నెగిటివిటీని తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పాత్రలన్నింటిని విమర్శించిన నోళ్లెన్నో ఉన్నాయి.అయితే 900 కోట్లు వసూళ్లు తెచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా కావడం తో ఆ పనికిమాలిన విమర్శలన్నీ కొవొత్తిలా కరిగిపోతున్నాయి. ఈమధ్యే షారుక్ ఖాన్ కూడా విలన్ పాత్రలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఎంతో ఆశాజనకంగా..సంతోషంగా ఉండే కథల్నే ఎంచుకుంటాను.ఇక నా సినిమాలో హీరో పాత్ర మంచి పనులే చేస్తుంది. అలాగే ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. ఎప్పటికైనా చెడుపైన మంచే గెలుస్తుంది' అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి అంతే ధీటుగా స్పందించినట్లు సమాచారం తెలుస్తోంది.



 హీరో పేరు పెట్టకుండా అతడిపై తనదైన శైలిలో స్పందిం చాడు సందీప్ రెడ్డి. 'కొందరికి అసలు హీరో అంటే అర్ధం ఏంటో తెలియడం లేదు. ఆదర్శవంతమైన పాత్రలే చేయా లని..ఆలాచేస్తేనే హీరో అవుతారని వారు అనుకుంటున్నారు. నేను అయితే అలా అనుకోను' అంటూ సందీప్ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ కామెంట్స్ షారుక్ ఖాన్ కి కౌంటర్ గానే వేసినట్లు నెటిజనులు అభిప్రాయ పడుతున్నారు.ఇక ఈ మాటల యుద్దానికి ముందే షారుక్ ఖాన్ తో ఓ సినిమా చేయాలని ఉందని సందీప్ రెడ్డి వంగ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఏ దర్శకుడైనా షారుక్ ఖాన్ తో కలిసి పనచేయడానికి ఎదురు చూస్తాడని..నేను కూడా అతని కోసం ఎదురు చూస్తున్నట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. ఫ్యూచర్ లో తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు. ఇక అటుపై షారుక్ ఖాన్ సినిమాలో పాత్రల గురించి మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. అందువల్ల సందీప్ రెడ్డి వంగా సీన్ లోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడది చినిగి చినిగి గాలి వానలాగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: