కోలీవుడ్ నటుడు
శివ కార్తికేయన్ తాజాగా ఆయాలాన్ సినిమాలో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం
జనవరి 12 వ తేదీన
తమిళ భాషలో విడుదల చేశారు. ముందుగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాను
తమిళ్ తో పాటు తెలుగు లో కూడా
జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇదే తేదీన తెలుగు
సినిమా ఇండస్ట్రీ నుండి రెండు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉండడం ... అలాగే ఆ తర్వాత కూడా వరుసగా మరో రెండు తెలుగు సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాని తెలుగులో
జనవరి 12వ్వ తేదీన విడుదల వాయిదా వేసుకుంది. ఇకపోతే ఈ
సినిమా జనవరి 12 వ తేదీనే
తమిళ భాషలో విడుదల అయ్యి అక్కడ మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ
సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ
మూవీ ని ఈ సంస్థ వారు
తమిళ భాషలో ఈ రోజు నుండి అనగా
ఫిబ్రవరి 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే
థియేటర్ ప్రేక్షకులను బాగా అలరించిన ఈ
సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను
థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ
సినిమా తమిళ భాషలో సన్ నెక్స్ట్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.