SSMB 29 మహేష్ యాక్షన్ మోడ్ స్టార్ట్..!
అందుకే ఆ హెయిర్ కనిపించకుండా ఉండాలనే తను అలా క్యాప్ తో కవర్ చేస్తున్నాడు. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమా కంప్లీట్ గా వేరే ప్రపంచంలో ఉండేలా చూస్తున్నాడు రాజమౌళి. యాక్షన్ అడ్వెంచర్ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో నో కాంప్రమైజ్ అన్న విధంగా రాజమౌళి ప్లానింగ్ ఉంది.
ఈ సినిమా కోసం తన టెక్నికల్ టీం ని మార్చే పనుల్లో ఉన్నాడు రాజమౌళి. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తప్ప మిగతా వారందరిని మార్చేస్తున్నాడని టాక్. ఐతే తన సూపర్ హిట్ టీం ని మార్చాలన్న ఆలోచన రాజమౌళికి ఎందుకొచ్చిందో తెలియదు కానీ రాజమౌళి మాత్రం ఈ సినిమా కోసం భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ డీటైల్స్ కూడా డిసైడ్ చేయలేదని టాక్. రాజమౌళి మహేష్ కాంబో మూవీ 300 కోట్ల బడ్జెట్ తో రాబోతుందని అంటున్నారు. సూపర్ స్టార్ రేంజ్ పెంచేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మహేష్ నెవర్ బిఫొర్ లుక్ తో సినిమాలో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాతో హాలీవుడ్ ని కూడా షేక్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ ఆడియన్స్ కూడా రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.