చిక్కుల్లో పడిన 'బేబీ' మూవీ దర్శక నిర్మాతలు....!!

murali krishna
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న గా వచ్చిన బేబీ మంచి విజయాన్ని సాధించడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.ఈ జూలై 2023లో విడుదలై అందరి చేత శబాష్ అనిపించుకుంది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యూత్‌ని ఎంతగానో అలరించింది. కథాంశం, దాన్ని ట్రీట్ చేసిన విధానంపై భిన్నాభిప్రాయాలు వచ్చినా పెద్ద హిట్ అయింది. తాజాగా 'బేబీ' చిత్ర బృందంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కథను కాపీ కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. ఇంతకు ఈ ఫిర్యాదు చేసింది ఎవరంటే బేబీ కథను ఓ షార్ట్ ఫిల్మ్ నుంచి దొంగలించారట. బేబీ కథ తనదే అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఫిర్యాదు చేశాడు. తన షార్ట్ ఫిల్మ్ కథను 'బేబీ' కథ కాపీ చేశారని ఆరోపిస్తూ షిరిన్ సాయిశ్రీరామ్ అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ హైదరాబాద్‌లోని రాయదుర్గ పోలీస్ స్టేషన్‌లో 'బేబీ' దర్శక, నిర్మాతపై ఫిర్యాదు చేశారు.

శిరీన్ సాయిశ్రీరామ్ మాట్లాడుతూ.. తాను 'ప్రేమించొద్దు' అనే షార్ట్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేసి, నిర్మించి, విడుదల చేశానని, 'బేబీ' దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత శ్రీనివాస్ కుమార్ నా అనుమతి లేకుండా కథనుకాపీ చేసి తమ లో వాడుకున్నారని ఆరోపించాడు. దర్శకురాలు శిరిన్ సాయిశ్రీరామ్ గతంలో 'కన్నా ప్లీజ్' అనే కథను 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌కి వినిపించారు. ఆ తర్వాత అదే కథను 'ప్రేమించొద్దు' అనే షార్ట్ ఫిల్మ్‌గా తీశారు. కానీ సాయి రాజేష్ తాను చెప్పిన కథను నిర్మాత ఎస్‌కెఎన్‌కి చెప్పాడని శిరీన్ సాయిశ్రీరామ్ ఆరోపించాడు. ఒకే సమయంలో ఇద్దరు యువకులను ప్రేమించే ఓ యువతి కథే 'బేబీ'. లో ఇచ్చిన సందేశం కూడా సరైనది కాదు అని.. యువతులపై ద్వేషాన్ని పెంచుతోందని కొందరు ఆరోపించారు. అయితే ఈ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ హిందీలో కూడా రీమేక్ కానుంది. ఇప్పుడు ఇలా పోలీస్ కేసు నమోదు కావడం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: