రజనీకాంత్ ను వెంటాడుతున్న చిరంజీవి అనుభవాలు !
తెలుగు రాష్ట్రాలలోనే కాదు రజనీకాంత్ ను విపరీతంగా ఆరాధించే తమిళనాడులో కూడ ఈమూవీకి మొదటిరోజు మార్నింగ్ షో నుండి పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో ఐశ్వర్య చేసిన ప్రయోగంలో రజనీకాంత్ అనవసరంగా కార్నర్ అయ్యాడు అంటూ అతడి అభిమానులు భావిస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ సక్సస్ తో జోష్ లోకి వెళ్ళిపోయిన చిరంజీవికి ఆ తరు వాత నటించిన భోలా శంకర్ ఫెయిల్ అవ్వడం తో ఆ షాక్ నుండి కొలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది అని అంటారు.
దీనితో కళ్యాణ్ కృష్ణతో తాను చేయవలసిన మూవీని పక్కకు పెట్టి ‘విశ్వంభర’ వైపు వెళ్ళిపోయాడు. లేటెస్ట్ గా రజనీకాంత్ కు కూడ ఇదే పరిస్థితి ఎదురైంద అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత శుక్రువారం విడుదలైన ‘లాల్ సలామ్’ మూవీని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు తమిళ ప్రేక్షకులు కూడ పట్టించుకోకపోవడం షాకింగ్ గా మారింది.
రజనీకాంత్ అభిమానులు అయితే ఈసినిమాను చూసి తమ హీరోకి అతడి కూతరు ఐశ్వర్య పై ప్రేమ ఉంటే ఫర్వాలేదు కాని తన కూతురు కోసం ఇలాంటి అర్థంలేని చెత్త సినిమాలలో నటించడం ఏమిటి అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి ‘భోళా శంకర్’ అనుభవాలు రజనీకాంత్ ‘లాల్ సలామ్’ లో గుర్తించలేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో రజనీకాంత్ కు చిరంజీవికి ఒకే రకం సమస్యలు వచ్చాయి అంటూ మరికొందరు జోక్ చేస్తూ సినిమా కథ బాగుండకపోతే చిరంజీవి రజనీకాంత్ ల సినిమాలకు కూడ మినహాయింపు ఉండదా అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..