అమ్మడు ఏం చేసినా అవకాశాలు రావట్లేదు..!
అయితే సినిమాలు చేస్తున్నా స్టార్ సినిమాలు సంపాదించడంలో మాత్రం వెనకడుగు వేస్తుంది. నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లో నటించినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు. అఖండ ఎంత పెద్ద హిట్ అయినా ఆ సినిమాలో నటించిన ప్రగ్యాకి మాత్రం ఆ సినిమా హిట్ ఫేవర్ చేయలేదు. చేతిలో సినిమాలేవి లేకపోవడం వల్ల ప్రగ్యా ఇక ఫోటో షూట్స్ తోనే ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రోజుకొక ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది.
ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ ఆమెను మరింత క్రేజీగా మారేలా చేసింది. తన ఘాటైన ఫోజులతో అమ్మడు ఫాలోవర్స్ ని తన మాయలో పడేయాలని చూస్తుంది కానీ అమ్మడు ఎంత ప్రయత్నించినా సరే అది వర్క్ అవుట్ అవ్వట్లేదు. లేటెస్ట్ గా అమ్మడు తన క్రేజీ ఫోటో షూట్స్ తో రచ్చ రంబోలా చేస్తుంది. ప్రగ్యా ఏం చేసినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం రావట్లేదు. అమ్మడి కష్టాన్ని గుర్తించి అవకాశాలు ఇవ్వాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. ప్రగ్యా జైశ్వాల్ కి మళ్లీ సినిమా ఛాన్స్ వస్తే ఈసారి సినిమాలో కూడా ఏమాత్రం తగ్గకుండా తన గ్లామర్ షోతో అదరగొట్టేయాలని ఫిక్స్ అయ్యింది.