అందుకే సినిమా ఫ్లాప్ అయింది.. త్రీ మూవీపై ఐశ్వర్య కామెంట్స్ వైరల్?
ఈ సినిమాతోనే ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. 2012లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అయితే ఈ సినిమా కోసం రాక్ స్టార్ అనిరుద్, కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత ప్రియులందరినీ కూడా ఎన్నో రోజులపాటు ఈ పాట మత్తులో ఊపేసింది. ఇక యూట్యూబ్లోనూ మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ పాట హిట్ అయినప్పటికీ ఎందుకో ఈ సినిమా విజయానికి మాత్రం ఈ పాట పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఇటీవల లాల్ సలాం ప్రమోషన్స్ లో పాల్గొన్న ఐశ్వర్య త్రీ సినిమా డిజాస్టర్ పై స్పందించింది.
త్రీ సినిమాలోని వైదీస్ కొలవరి పాట అంత పెద్ద సక్సెస్ అవడం.. సినిమా కంటెంట్ మీద ప్రభావం చూపించింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది ఐశ్వర్య రజనీకాంత్. సినిమా కంటెంట్ చాలా సీరియస్ గా ఉంటుంది. కానీ ఈ పాట సినిమాపై భిన్నమైన అంచనాలను ప్రేక్షకుల్లో తీసుకొచ్చింది. ఇక ఫలితంగా ప్రేక్షకులు నిరాశ చెందారు అంటూ చెప్పుకోచ్చింది. ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కెరియర్ కు సహాయపడినందుకు తాను సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపింది. అయితే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి ఇక వైదీస్ కొలవెరి పాటకు మధ్య చాలా వేరియేషన్ ఉంటుంది. దీంతో ఈ పాట విన్న ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగా ఇక కంటెంట్ వేరే ఉండడంతో ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీంతో సినిమా డిజాస్టర్ అయ్యింది.