జై హనుమాన్ లో హీరోగా కేజిఎఫ్ హీరో.. నిజమేనా..!?

Anilkumar
సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్  షేక్ చేసింది. ముఖ్యంగా హనుమాన్ సినిమా విజువల్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ఊహించని విధంగా క్వాలిటీ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో సినిమా చూసిన వారందరూ షాక్ అయ్యారు. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాల కంటే తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నే అందరికీ నచ్చింది. ఇక వరల్డ్ వైడ్గా కేవలం 50 కోట్ల బడ్జెట్ వచ్చిన

ఈ సినిమా 300 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. కాగా హనుమాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జై హనుమాన్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్ లో హనుమాన్ హీరోగా ఉంటాడు. హనుమాన్ పాత్ర ఒక స్టార్ హీరో చేస్తారని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.  కాగా జై హనుమాన్ లో నటించే హీరో రానా అంటూ ప్రచారం జరిగింది. హనుమాన్ లో ఫేస్ సరిగా రివీల్ చేయకపోయినప్పటికీ హనుమాన్ పాత్ర చేసింది రానా అని కథనాలు వెలువడ్డాయి. దీంతో జై హనుమాన్ హీరో రానా అని జనాలు ఫిక్స్ అయ్యారు.

అయితే ఈ ప్రాజెక్ట్ హీరోగా యష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యష్ కరెక్ట్ అనుకుంటున్నారట.  జై హనుమాన్ భారీ బడ్జెట్ మూవీ కావడంతో యష్ ని లైన్లోకి తెస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. టాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. మరి అదే జరిగితే బాక్సాఫీస్ బద్దలే అనడంలో సందేహం లేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: