వయసు పెరుగుతున్నా.. తరగని అందం తో ప్రియమణి..!

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ప్రియమణి. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి భారీ సంపాదించుకుంది. ఎవరే అతగాడు అనే సినిమాలో హీరోయిన్గా నటించిన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ప్రియమణి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకొని టాప్ హీరోల సరసన హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో గోపీచంద్ ఎన్టీఆర్ జగతి జగపతిబాబు నితిన్ బాలకృష్ణ రవితేజ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.


కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఎక్కువగా మాత్రం తెలుగు సినిమాలలోనే నటించింది ప్రియమణి. అంతేకాకుండా కన్నడ హిందీ తెలుగు భాషల్లో జడ్జిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పైన కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సినిమాలలో పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకూడా జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.


ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ప్రియమణి ఒకవైపు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణి తన ఇంస్టాగ్రామ్ కాదు నీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో పద్ధతిగా పంజాబీ డ్రెస్ ను ధరించిన ఆమె సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: