"జై హనుమాన్" మూవీలో యాష్... వార్తలపై స్పందించిన మూవీ బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ మౌత్ టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా చివరలో హనుమాన్ మూవీ కి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ ఉండబోతున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.


ఇకపోతే గత కొన్ని రోజులుగా జై హనుమాన్ మూవీ లో హనుమంతుల వారి పాత్రలో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ నటించబోతున్నాడు అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్త జోరు పెరగడంతో హనుమాన్ మూవీ యూనిట్ ఈ వార్తపై తాజాగా స్పందించింది. తాజాగా హనుమాన్ మూవీ యూనిట్ స్పందిస్తూ ... జై హనుమాన్ సినిమాలో హనుమంతుల వారి పాత్రలో యాష్ నటించబోతున్నాడు అని అనేక వార్తలు వస్తున్నాయి.


ఈ వార్తలు అన్ని అవాస్తవం. మేము ఇప్పటి వరకు జై హనుమాన్ సినిమాలో హనుమంతుల వారి పాత్ర కోసం ఏ నటుడిని అనుకోలేదు అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ఇప్పటికే హనుమాన్ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో జై హనుమాన్ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికీ కూడా హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతూ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: