మరోసారి ఐటమ్ సాంగ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సుకుమార్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి సుకుమార్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఆర్య మూవీ తో డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎక్కువ శాతం మూవీ లతో సూపర్ సక్సెస్ లను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే సుకుమార్ తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమా నుండి దాదాపుగా తన సినిమాలలో ఐటమ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు.


అందులో భాగంగా ఈయన దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమాను వదిలి పెడితే మిగతా అన్ని సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఆ సాంగ్స్ అన్నీ కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇది ఇలా ఉంటే సుకుమార్ ఆఖరుగా అల్లు అర్జున్ హీరో గా పుష్ప పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ కి సూపర్ క్రేజ్ జనాల నుండి లభించింది. ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ "పుష్ప పార్ట్ 2" మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.


ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అయినటువంటి దిశా పటానీ ని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చూపించే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు అందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా ఇప్పటికే ఈ చిత్ర బృందం మొదలు పెట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: