హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన ఫైటర్ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. గతేడాది రిపబ్లిక్ డే సమయంలోనే షారుక్ ఖాన్ తో పఠాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ అందించిన సిద్ధార్థ్ ఆనంద్ నుంచి ఫైటర్ రావడంతో మూవీ భారీ అంచనాల మధ్య వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఊహించినంత బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం రాలేదు. 19 రోజుల్లో ఈ మూవీ రూ.340 కోట్లు వసూలు చేసింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం అద్భుతాలు చేయలేకపోయింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనెలతో
పాటూ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 'ఫైటర్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 'ఫైటర్' ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించినట్లు సమాచారం. థియేటర్లో విడుదలైన 56 రోజుల తర్వాత హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఎగ్రిమెంట్ కూడా చేసుకున్నారట మేకర్స్. దీంతో సినిమా రిలీజైన 56వ రోజు.. అంటే మార్చి 21న ఈ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే దీనిపై ఇప్పటి వరకూ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదీ రాలేదు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో మన వాయు సేన చేసే పోరాటం చుట్టూ సాగే కథ ఇది.మన వీరులు గగనతలంలో చేసే సాహస విన్యాసాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో కథ కంటే కూడా డ్రామా, యాక్షన్తో కూడిన హంగామానే ఎక్కువ. శత్రుదేశమైన పాకిస్థాన్, అక్కడ ఉగ్రవాదులు కలిసి పన్నే పన్నాగాల చుట్టూనే తిరుగుతుంది.