మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో వ్రిధి సినిమాస్ ,
సుకుమార్ రైటింగ్స్ , మైత్రి సంస్థ వారు సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో
హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి ఉప్పెన సినిమాతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి ... మొదటి
మూవీ తోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని
టాలీవుడ్ ఇండస్ట్రీ లో
డైరెక్టర్ గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న బుచ్చిబాబు
సనా దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇకపోతే ఈ
మూవీ లో
కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్
కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ
మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే రెహమాన్ ఈ
మూవీ కి సంగీతం అందించబోతున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
శివ రాజ్
కుమార్ ఈ
మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఆయనే స్వయంగా ధృవీకరించాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో చరణ్ కి జోడిగా
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ
మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్
మార్చి నెల ప్రారంభం కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా పూజా కార్యక్రమం మరియు రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ యొక్క
పూజా కార్యక్రమాలను
మార్చి నెలలో నిర్వహించబోతున్నట్లు ... ఆ తర్వాత మే నెల నుండి ఈ
సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ
మూవీ బృందం మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.