టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ..నా సామి రంగ..కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం లో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ మూవీ లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే అల్లరి నరేష్ కి జోడి గా మిర్నా మీనన్, రాజ్ తరుణ్ కి జోడి గా రుక్సర్నటించారు.సంక్రాంతి కానుక గా జనవరి 14న థియేటర్ల లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. చాలా కాలం తరువాత నాగార్జునకు హిట్ లభించడం తో అక్కినేని ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. అయితే థియేటర్‌ల లో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+ హాట్‌స్టార్ వేదిక గా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. పవన్ కుమార్ సమర్పణ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించాడు. ఈ చిత్రానికి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కించారు
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1960-80మధ్య కాలంలో గోదావరి, అంబాజీపేట నేపథ్యం లో ఈ కథ సాగుతుంది.కిష్టయ్య( నాగార్జున) అంజి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా నే వుంటారు. ఆ ఊర్లో వడ్డి వ్యాపారం చేసే వరదరాజులు( రావు రమేష్) కూతురు వరాలు( అషికా రంగనాథన్) కిష్టయ్య ప్రేమించుకుంటారు. అయితే అనుకోని ఓ ఘటన వాళ్ళ పెళ్ళికి అడ్డంకి గా మారుతుంది. మరి వారిద్దరి పెళ్లి జరిగిందా..వీళ్ళ పెళ్లికి వున్న అడ్డంకి ఏమిటి..? అనేది ఈ చిత్ర కథ