'అరుంధతి' రేంజ్ లో 'శీలవతి'?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. నాగార్జున సూపర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కెరీర్ తొలి దశలో చాలా గ్లామర్ పాత్రలు చేసింది.అరుంధతి మూవీ తర్వాత నుంచి తన రూటే సపరేటు అన్నట్లుగా విభిన్నమైన కథలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు టాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ హాట్ బ్యూటీ.అరుంధతి మూవీలో అనుష్క నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి ,రుద్రమదేవి ,భాగమతి సినిమాలు ఆమెకు స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ను తెచ్చిపెట్టి ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇదే సక్సెస్ ఒక మిడ్ రేంజ్ హీరో ఖాతాలో పడితే.. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుస సినిమాలతో ఇప్పుడు హడావిడి చేసేవాడు. అయితే అనుష్క మాత్రం సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది.. బయట కూడా మిగిలిన స్టార్స్ లాగా ఆమె పెద్దగా కనిపించడం లేదు.ఈ విషయం ఆమె అభిమానులను చాలా నిరాశకు గురి చేస్తోంది. నిశ్శబ్దం సినిమా తర్వాత సినిమా చేయడానికి అనుష్కకు సుమారు నాలుగు సంవత్సరాల టైం పట్టింది.



రీసెంట్ గా ఆమె నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఇంకా స్వీటీ నుంచి నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈసారి కూడా నెక్స్ట్ సినిమాకి లాంగ్ గ్యాప్ ఉంటుందేమో అని అందరూ అనుకునే టైంలో సడన్గా తన తరువాత మూవీ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది అనుష్క.2010లో విడుదలైన వేదం సినిమా తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు క్రిష్ డైరెక్షన్ లో ఆమె మరొక సినిమా చేయబోతోంది. ఈ సినిమాకి ఓ క్రేజీ టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు టాక్. ఈ మూవీ టైటిల్ ఏమిటో తెలుసా.. శీలావతి..అయితే ఈ పేరుతో ఒక చేప కూడా ఉంది.జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ టైటిల్ హీరోయిన్ క్యారెక్టర్ కు సంబంధించిన సెటైరికల్ టైటిల్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో అనుష్కకు జోడిగా తమిళ్ నటుడు విక్రమ్ ప్రభువు నటించనున్నారు.అరుంధతి లాగా ఈ శీలావతి సినిమా కూడా అనుష్క కెరీర్ లో ఓ మంచి లేడీ ఓరియంటెడ్ మూవీ అవుతుందని అందరూ భావిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఆ రేంజ్ లో ఈ సినిమా స్టోరీ రాసుకున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: