రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్ తమ్ముడు....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ల్లో “143 ఐ మిస్ యూ” ఒకటి. 2004లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సాంగ్స్ వింటూనే ఉంటాం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో ఆయన తమ్ముడు సాయి రాం శంకర్ హీరోగా నటించారు. ఇందులో సమీక్ష, నాగబాబు, బ్రహ్మానందం, కీలకపాత్రలు పోషించారు. సాయిరాం శంకర్ కెరీర్ ఈమూవీతో టర్న్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస లు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన లు థియేటర్లలో డిజాస్టర్స్ కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న సాయిరాం శంకర్ ఇప్పుడు 'ఒక పథకం ప్రకారం' తో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది.వినోద్‌ విజయన్‌ ఫిలిమ్స్, విహారి హౌజ్‌ బ్యానర్స్ పై ఈ ను నిర్మిస్తున్నారు. ఇందులో సాయిరామ్‌ శంకర్, అశీమా నర్వాల్‌, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. వినోద్‌ విజయన్, గార్లపాటి రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాకుండ ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ టెక్సీషియన్స్ ఈ కు వర్క్ చేస్తున్నారు. ఈ మూవీని మార్చిలో థియేటర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి రాహుల్ రాజ్ సంగీతం అందిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్‌ విజయన్ మాట్లాడుతూ.. “ఈ ను విభిన్నమైన కథాంశంతో నిర్మిస్తున్నాం. థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ లో సాయిరాం శంకర్ పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఇందులో సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకే హైలైట్ గా నిలుస్తుంది. రాహుల్ రాజ్ అద్భుతమైన రెండు పాటలు అందించారు. ఆ రెండింటికి సిధ్ శ్రీరాం తన గాత్రంతో ప్రాణం పోశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ “ఒసారిలా రా” మంచి రెస్పాన్స్ వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: