మెగాస్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమలహాసన్ ??
అయితే చిరంజీవిపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తలుచుకుంటే కోలీవుడ్ లో కూడా పెద్ద స్టార్ అయ్యేవాడట. ఆయన చెబుతూ, చిరంజీవి తలుచుకుంటే తమిళంలో కూడా ఈజీగా పెద్ద స్టార్ అయ్యేవాడు. కానీ ఆ సమయంలో ఆయన కోలీవుడ్‌పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అని పేర్కొన్నారు కమల్. అయితే కమల్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. మెగా అభిమానులు వాటిని ఇప్పుడు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. కమల్ హాసన్ వంటి పెద్ద నటుడు మెగాస్టార్ గురించి గొప్పగా మాట్లాడంతో వాళ్లంతా ఖుషి అవుతున్నారు. అది చిరంజీవి రేంజ్ అని కామెంట్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ మూవీ తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2, కల్కి, థగ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.