ఫేమస్ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నర్ షణ్ముఖ్ వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అతని అన్న కోసం ఇంటికి వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయి తో దొరకడం చూసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంలో ఒక కీలక మలుపు కూడా చోటుచేసుకుంది. అందువల్ల ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. షణ్ముఖ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా అతడు గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో కూడా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో షణ్ముఖ్ యూరిన్ శాంపిల్ సేకరించగా.. అందులో గంజా పాజిటివ్ అని వచ్చిందని సమాచారం తెలుస్తుంది. దీంతో షణ్ముఖ్ పై పోలీసులు కేసు నమోదు చేయనున్నారని సమాచారం తెలుస్తుంది. మరోవైపు షణ్ముఖ్ అన్న సంపత్ పై.. ఇప్పటికే చీటింగ్, రేప్ కేసులు నమోదు చేశారని చెబుతున్నారు.షణ్ముఖ్ అన్నపై ఒక యువతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా షణ్ముఖ్ అన్న సంపత్ తనను నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించారు.తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడి కూడా చేశాడని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో తనను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుతో షణ్ముఖ్ అన్న సంపత్ కోసం పోలీసులు నానక్ రామ్ గూడలోని నివాసానికి వెళ్లగా... అక్కడ గంజాయి లభించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంల్లో అక్కడున్న మత్తు పదార్థాలను సీజ్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో అతనికి టెస్ట్ చేయగా.. గంజాయి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సమాచారం తెలిసింది. దీంతో మరో పెద్ద వివాదంలో షణ్ముఖ్ చిక్కుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ ఆ తరువాత వెబ్ సిరీస్ తీస్తూ బాగా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ 5 లో ఛాన్స్ కొట్టి రన్నారప్ గా నిలిచాడు. ఆ తరువాత కూడా రెండు వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడిప్పుడే మంచి లైట్ లోకి వస్తున్న షణ్ముఖ్ కి ఈ వివాదం ఆల్మోస్ట్ అతని కెరీర్ నాశనం అయ్యేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.