పెళ్లి బాజా మ్రోగించనున్న బిగ్ బాస్ హౌస్ మెట్స్..??

murali krishna
బిగ్ బాస్ ద్వారా అనేకమంది పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ - రతిక  త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నరు. ఇక మరికొందరు మాత్రం దీని ద్వారా లవ్లో పడడం మరియు బ్రేకప్ జరగడం వంటివి కూడా చేసుకున్నారు. బయట ఒకరితో రిలేషన్ లో ఉన్నవారు బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన అనంతరం మరొకరితో రిలేషన్ లో ఉండడంతో అది చూసి తట్టుకోలేని లవర్స్ విడిపోయారు కూడా.ఇక మరికొందరు మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి కొత్త అనుబంధాలను కలుపుకుంటూ జతకట్టారు. ఇక గత సీజన్లో ఇటువంటివి జరిగిన బయటకు వచ్చిన తర్వాత అంతా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ సీజన్ 7 లో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ మరియు రతిక పై ఈ తీవ్రత ఘోరంగా చూపించిందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మని రతిక అని పిలవడం కంటే రాధిక అని పిలవడం చాలా మేలు. ఎందుకంటే హౌస్ లోకి అడుగుపెట్టిన మొదట్లో తనకు లవర్ ఉన్నాడని తనే తన ప్రపంచమని.. తన లవర్ రాహుల్ సిప్లిగంజ్ అని తెలియజేసింది.

ఇక అనంతరం స్లో స్లోగా యావర్ తో ట్రాక్ మొదలుపెట్టింది. ఇక యావర్ తో కొన్ని మనస్పార్ధాలు రావడంతో ప్రశాంత్ వైపుకు మళ్ళింది. ఇక మజ్జిట్లో బయటకి వెళ్లి వచ్చిన రతిక వచ్చినా అనంతరం మళ్లీ యావర్ తో లవ్ ఎఫైర్ ని కంటిన్యూ చేసింది. తను హౌస్ లో ఉండేందుకు ఒక సాకును నేతుక్కుంటూ కొన్నాళ్లు కొనసాగినప్పటికీ తన ప్రవర్తన ప్రేక్షకులకి నచ్చక మరోసారి బయటకు పంపించేశారు. ఇక ఈ గోల ఇక్కడితో పోయింది అనుకునే లోపే కొన్ని షూస్ కి పాల్గొంటూ మళ్లీ కలిసి పోయారు ప్రశాంత్ మరియు రతిక.బిబి ఉత్సవంలో వీరిద్దరూ సందడి చేశారు. ఇక వీరిద్దరి మధ్యలో నేనెందుకు అనుకున్న యావర్.. నయని పావనితో ఎఫైర్ మొదలుపెట్టాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ మరియు రతిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: