తెలుగు ఇండస్ట్రీలో రోజాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100 సినిమాలు హీరోయిన్గా నటించింది అంటేనే ఆమె ఎంత స్టార్ అనేది అర్థమవుతుంది. పదేళ్ల సమయంలోనే 100 సినిమాలు చేసింది రోజా. తెలుగు, తమిళ, కన్నడ అలా ప్రతీ భాషలోనూ ఈమెకు పాపులారిటీ ఉంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. దాంతో పాటు చిన్న హీరోలతో కూడా రొమాన్స్ చేసింది రోజా. ఈ క్రమంలోనే టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో శ్రీకాంత్తో కూడా నటించింది తెలుగు ఇండస్ట్రీలో రోజాకు ఉన్న ఫాలోయింగ్ ఉన్న రోజా. అప్పట్లో ఈ జోడీ కలిసి నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది..
మార్కెట్ కూడా ఉంది. ఇద్దరూ కలిసి నటించిన ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ లాంటి హిట్స్ కూడా ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో రోజా నటించిన సూపర్ హిట్ మూవీ సీతారత్నం గారి అబ్బాయి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించగా వినోద్ కుమార్, రోజా జంటగా నటించారు. వాణిశ్రీ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో శ్రీకాంత్... రోజా అన్నయ్య పాత్ర చేశాడు. ఆ చిత్రంలో శ్రీకాంత్ ది నెగిటివ్ రోల్. శ్రీకాంత్ హీరోగా ఎదిగాక రోజాకు జంటగా నటించారు. వీరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ క్షేమంగా వెళ్లి లాభంగా రండి.
శ్రీకాంత్ కి భార్యగా తెలుగు ఇండస్ట్రీలో రోజాకు ఉన్న ఫాలోయింగ్ ఉన్న రోజా నటించింది. అదే ఏడాది తిరుమల తిరుపతి వెంకటేశా చిత్రంలో జతకట్టారు. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.ఆ విధంగా అన్నయ్య పాత్ర చేసిన శ్రీకాంత్ తో రోజా రొమాన్స్ చేయాల్సి వచ్చింది. శ్రీకాంత్ ని రోజా సెట్స్ లో అన్నయ్య అని పిలిచేదట. చివరికి రొమాంటిక్ సీన్స్ లో కూడా అన్నయ్య అంటుంటే శ్రీకాంత్ కి చాలా ఇబ్బంది పడేవాడట. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!