టాలీవుడ్ లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన
దీపక్ సరోజ్ హీరోగా పరిచయమైన చిత్రం 'సిద్ధార్థ్ రాయ్'. హరీష్ శంకర్,
వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసిన యశస్వీ ఈ సినిమాతో
డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.ఇక
సినిమా ఎలా ఉందంటే.. దర్శకుడు యశస్వీ ఎంపిక చేసుకున్న పాయింట్, చెప్పాలనుకున్న కథ..
ఐడియా పరంగా బాగానే ఉన్నా, సినిమాగా తెరపైకి తీసుకురావడంలో తడబడ్డాడు. ఎమోషన్స్ కి, లాజిక్స్ కి మధ్య నలిగే వ్యక్తిగా హీరోని చూపించే క్రమంలో.. ఓవర్ డ్రామా, అవసరానికి మించి అసలు అవసరమా అనిపించే బోల్డ్ సీన్స్ పెట్టారు.ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే ఈ
సినిమా సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' 144P వెర్షన్ లాగానే ఉంది. అలాగే దాంతో పాటుగా 'యానిమల్', 'వరల్డ్ ఫేమస్ లవర్' లాంటి సినిమాలు గుర్తు చేసేలా
హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఎమోషనల్ క్యారెక్టర్ ను తీసుకొని ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా, అర్థమయ్యేలా తీయడంలో.. కథలో ఎమోషన్స్ ను పండించడంలో దర్శకుడు దారుణంగా ఫెయిల్ అయ్యాడు.
హీరో లుక్స్ నుంచి బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా
సందీప్ రెడ్డి వంగాని కాపీ కొట్టారు. ప్రతీ సీన్ లో కూడా
హీరో పాత్రని బలవంతంగా ఎలివేట్ చేసే ప్రయత్నమే జరిగింది. ఇక బూతులు, రొమాన్స్ ఇంకా అంతకుమించిన బోల్డ్ సీన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అసలు కంటెంట్ కంటే బోల్డ్ సీన్లు హైలైట్ అయ్యాయనే టాక్ వచ్చింది. కేవలం బోల్డ్ నెస్ ను ఇష్టపడే ఓ వర్గం
ఆడియన్స్ కు మాత్రమే ఈ
సినిమా నచ్చుతుంది.ఇక
హీరో లుక్స్ విషయానికి వస్తే చైల్డ్ ఆర్టిస్టుకి మీసాలు పెట్టినట్లు ఉంటాడు.
హీరోయిన్ తన్వి నేగి చాలా కంఫర్ట్ గా బోల్డ్ సీన్లు చేసింది. కనీసం మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ వరస్ట్. నిర్మాణ విలువలు సున్నా. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా
సినిమా మాత్రం అస్సలు బాగోదు. ఈమధ్య కాలంలో వచ్చిన చెత్త సినిమాల్లో ఈ
సినిమా ముందు వరసలో ఉంటుంది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ తక్కువ.. చెత్త ఎక్కువ కాబట్టి..