ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే రజనీ కాంత్ కొంత కాలం క్రితం జైలర్ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషమ అందరికి తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో రమ్య కృష్ణ , రజినీ కాంత్ కు భార్య పాత్రలో నటించగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇక సునీల్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత రజనీ కాంత్ కు ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాగే ఈ మూవీ తెలుగు వర్షన్ కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం అయింది.
ఇకపోతే మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ రెండవ సారి జెమినీ టీవీ లో ప్రసారం అయింది. రెండవ సారి ఈ మూవీ జెమినీ టీవీ.లో ప్రసారం అయినప్పుడు ఈ మూవీ కి 3.82 "టీ ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఇలా ఈ సినిమా రెండవ సారి కూడా మంచి రెస్పాన్స్ ను బుల్లి తెరపై తెచ్చుకుంది.