గంజాయి కేసులో బుక్కైన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్..!!
ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మౌనిక అనే యువతితో సంపత్ కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తీరా ఆమెను కాకుండా మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాగా అసలు మౌనికను అన్న సంపత్ కి పరిచయం చేసింది షణ్ముఖ్ అట. తన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో అవకాశం ఇస్తానని కూడా మౌనికకు షణ్ముఖ్ ప్రామిస్ చేశాడట.మౌనికతో లైంగిక సంబంధం పెట్టుకున్న సంపత్ ఒకసారి ఆమెకు అబార్షన్ చేయించాడట. అన్ని విధాలా మోసపోయిన మౌనిక… సంపత్ మీద కేసు పెట్టింది. పోలీసులను తీసుకుని షణ్ముఖ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ షణ్ముఖ్, సంపత్ గంజాయి సేవిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. మత్తులో ఉన్న షణ్ముఖ్ ని మౌనిక కెమెరాతో షూట్ చేస్తుండగా… అతడు దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. అన్నదమ్ములు ఇద్దరూ ఓ యువతిని మోసం చేయడం సంచలనంగా మారింది.