HBD: అలాంటి రికార్డ్ సాధించిన ఏకైక ఇండియన్ హీరో నాని..!!
సినిమాల మీద మోజుతో నాని చదువును మధ్యలోనే వదిలేశారు.ఈ క్రమంలోనే రాధాగోపాలం అనే సినిమాలో డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.. ఆ తర్వాత పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశారు ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అష్టా చమ్మా సినిమాలో నాని హీరోగా పరిచయమయ్యారు.. ఈ సినిమా హిట్ కావడంతో గుర్తింపు రాలేదు.. కానీ ఆ తర్వాత రైడ్, స్నేహితుడా ,భీమిలి కబడ్డీ .. తదితర చిత్రాలలో నటించి తన నటనతో ప్రశంశాలు అందుకున్నారు.
అలాంటి సమయంలోనే డైరెక్టర్ నందిని రెడ్డితో అలా మొదలైంది సినిమాతో మంచి బ్రేక్ పడింది.. ఆ వెంటనే పిల్ల జమిందార్ తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఎలాంటి కథతోనైనా నాని అదరగొట్టేస్తూ ఉండేవారు. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా నాని కెరియర్ ని మార్చేసింది. దీంతో నాని ఇమేజ్ కూడా భారీగానే పెరిగిపోయింది.ఈగ తర్వాత చేసిన చిత్రాలు ప్లాపులు అయ్యాయి.. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా 8 హీట్స్ కొట్టిన ఘనత సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా పేరు సంపాదించారు నాని. హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కిస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు.