అఫీషియల్ : ఆర్సి16 కి కెమెరామెన్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా పెరిగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక రామ్ చరణ్ కూడా తన క్రేజ్ భారీగా పెరగడంతో ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్ అనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.
 


మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , ఎస్ జె సూర్యమూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చరణ్ ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చరణ్ క్లియర్ లో 16 వ మూవీ గా రూపొందరున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృందం అనౌన్స్ చేసింది.


ఇకపోతే ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతుండగా ... ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. శివరాజ్ కుమార్ ఈ మూవీ.లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ రోజు ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ ఎవరు అనే విషయాన్ని కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ప్రముఖ సినిమాటో గ్రాఫర్ రత్న వేలు పుట్టిన రోజు కావడంతో ఈయన ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నట్లు ఏ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rv

సంబంధిత వార్తలు: