తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో
సిద్ధార్థ్ ఒకరు. ఇకపోతే ఈయన తన కెరియర్ లో చాలా తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని
మూవీ లతో మంచి విజయాలను
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈయన కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలలో బొమ్మరిల్లు
మూవీ ఒకటి. ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని జెనీలియా
హీరోయిన్ గా నటించగా ...
ప్రకాష్ రాజ్ ,
జయసుధ ,
కోట శ్రీనివాసరావు ,
సునీల్ ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ
మూవీ ని నిర్మించగా ... రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. దేవి
శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ
మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది.
ఇకపోతే మంచి అంచనాల నడుమ 2006 వ సంవత్సరం విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ లాంగ్ రన్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఈ
మూవీ లోని
సిద్ధార్థ్ , జెనీలియా ,
ప్రకాష్ రాజ్ ,
జయసుధ , కోటా శ్రీనివాసరావు ,
సునీల్ నటనలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. అలాగే దేవి
శ్రీ ప్రసాద్ సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఆ సమయంలో మంచి విజయం సాధించిన బొమ్మరిల్లు
మూవీ ని తిరిగి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో
థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ రీ రిలీజ్ కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు చాలా సంవత్సరాలుగా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.