న్యాచురల్ స్టార్
నాని హీరోగా యంగ్
డైరెక్టర్ వివేక్
ఆత్రేయ తీస్తున్న
మూవీ 'సరిపోదా శనివారం'. ఇక ఈ
సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది.ఈ
సినిమా నిర్మాత DVV దానయ్యకు బిజినెస్ పరంగా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లుగా ఇండస్ట్రీలో సమాచారం అయితే వినిపిస్తోంది. అయితే ఈరోజు
నాని పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కోసం ఈ
సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.ఇక ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే..సూర్య వాయిస్ ఓవర్ తో
హీరో క్యారెక్టర్
సూర్య గురించి పరిచయం చేసిన విధానం అయితే బాగా హైలెట్ గా నిలిచింది. 'కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా.. నేను చూశాను.. అంటూ
సూర్య వాయిస్ ఓవర్ ఇస్తుండగా మన
హీరో నాని క్యారెక్టర్ యాక్షన్ మోడ్ లో పరిచయమవుతుంది.
చూస్తుంటే ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత
నాని నుంచి ఒక డిఫరెంట్ యాక్షన్
సినిమా రాబోతోందని మొదటి గ్లింప్స్ తోనే క్లారిటీ వచ్చేసింది. అతని పేరు సూర్య.. రోజు శనివారం.. అని మరొక డైలాగ్ తో
హీరో క్యారెక్టర్ ను హైలెట్ చేయగా రిక్షా తొక్కుకుంటూ వెనకాల ఒక వృద్ధుడికి కళ్ళజోడు పెట్టించి మరి తీసుకువచ్చే విధానం చూస్తూ ఉంటే క్యారెక్టర్ లో ఎన్నో రకాల షేడ్స్ ఉన్నాయి అని అనిపిస్తోంది.ఒకవైపు మంచితనం మరొకవైపు కోపంతో ఉండే క్యారెక్టర్ తో
నాని ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు చూస్తుంటే తెలుస్తోంది. సరిపోదా శనివారం టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాలో కంటెంట్ కూడా హైలెట్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎస్ జై
సూర్య నటించబోతున్న విషయం తెలిసిందే. అతను గ్లింప్స్ చివరలో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఇచ్చిన డైలాగ్ అయితే బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.