ఇండస్ట్రీ లో రిలేటివ్స్ అయిన కొంత మంది స్టార్ హీరోలు..!!
ఇక ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్న శర్వానంద్. అలాగే ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న రామ్ పోతినేని. ఇద్దరు బావ బామ్మర్ధులు అవుతారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ వరుస సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు…ఒకప్పుడు స్టార్ రైటర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్న రచయిత పోసాని కృష్ణ మురళి. ఆ తర్వాత నటుడిగా మారి తన నట విశ్వరూపంతో చాలా సినిమాల్లో నటించి మెప్పిచడమే కాకుండా, ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడిగా కూడా ఎదిగాడు. ఇక అలాంటి పోసాని కృష్ణ మురళికి బోయపాటి శ్రీను తమ్ముడు అవుతాడు. పోసాని కృష్ణ మురళి వాళ్ళ బాబాయ్ కొడుకే బోయపాటి శ్రీను..
ఇక స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ పోసాని కృష్ణ మురళి వాళ్ళ అక్క కొడుకు అనే విషయం కూడా చాలా మంది కి తెలియదు.ఈ లెక్కన పోసానికి కొరటాల మేనల్లుడు అవుతాడు. ఇక ప్రస్తుతం బోయపాటి, కొరటాల శివ ఇద్దరు కూడా స్టార్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి రైటర్ గా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు…