ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ ను చూపించింది. అందులో భాగంగా అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ చాలా విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమ ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే యానిమల్ మూవీ సూపర్ సక్సెస్ అయినప్పటికీ ఆ మూవీ సక్సెస్ ను నేను కొన్ని కారణాల వల్ల ఎంజాయ్ చేయలేకపోయాను అని అందుకు గల కారణాలను రష్మిక తాజాగా తెలియజేసింది.
తాజాగా రష్మిక మాట్లాడుతూ ... నేను నటించిన యానిమల్ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా విడుదల అయిన మరుసటి రోజు నేను మరో సినిమా షూటింగ్ లో జాయిన్ కావలసి వచ్చింది. దానితో ఈ సినిమా సక్సెస్ ను నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. అలాగే ఈ మూవీ సక్సెస్ సంబరాలను మీడియాతో పంచుకోలేకపోయాను. అలాగే కొన్ని ఈవెంట్ లకి కూడా నేను అటెండ్ కాలేకపోయాను అని రష్మిక తాజాగా తెలియజేసింది.