SSMB -29 హిస్టరీలోనే నిలిచిపోయేలా రాజమౌళి ప్లాన్..!!

Divya
మహేష్ నటిస్తున్న SSMB -29 సినిమా ఏకంగా పాన్ ఇండియా సినిమా కాదని పాన్ వరల్డ్ సినిమా అనడానికి ఇది ఒక సాక్షమని కూడా చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ప్రణాళికలు కూడా వేస్తూ ముందుకు వెళుతున్నారు.. ముఖ్యంగా నేషనల్ మీడియాతోనే ఒక ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని వార్త తెరపైకి వస్తోంది.. మహేష్ రాజమౌళి సినిమా కాంబినేషన్లో సినిమా అన్నగానే ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ అయ్యిందని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది..

మరొకవైపు అవసరమేరకు వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తి అయిన వెంటనే అధికారికంగా సినిమాని లాంచ్ చేయబోతున్నారు రాజమౌళి.. ఈ లాంచింగ్ ఇండియా హిస్టరీ లోనే నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఏకంగా హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ తీసుకువచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమాని లాంచ్ చేసి రెగ్యులర్గా సినిమా షూటింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

అలా ఆయన వచ్చిన సందర్భంగా ఏకంగా నేషనల్ మీడియానే తీసుకువచ్చి భారీ మీడియా అని ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి రాజమౌళి పిలిస్తే జేమ్స్ కామరూన్ వస్తారా అనే విషయం పైన ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న  వినిపిస్తోంది.. అయితే వస్తారని విషయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ మెచ్చిన మొట్టమొదటి ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి కాబట్టి...RRR సినిమాని ప్రశంసిస్తూ ఏకంగా ఒక వీడియోని సోషల్ మీడియాలో గతంలో విడుదల చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.. ఈ విషయంతో రాజమౌళి మరొక స్థాయికి ఎదిగారు మరి అంతటి లెజెండరీ మేకర్ని ఒకవేళ రాజమౌళి తీసుకువస్తే మహేష్ బాబు సినిమా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: