హెబ్బా
పటేల్ ,
పూజిత పొన్నాడ , వశిష్ట ఎన్.
సింహా , సాయి రోనక్ ప్రధాన పాత్రలలో
అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ
మూవీ కి కథను తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి
సంపత్ నంది అందించాడు.
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే కే
రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా ... అనుప్ రూబెన్స్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ
సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 2022 వ సంవత్సరం లో విడుదల అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా డైరెక్ట్ గా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. దానితో ఈ
మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా "ఓదెల 2" అనే
మూవీ ని రూపొందించబోతున్నారు. ఓదెల రైల్వే స్టేషన్
మూవీ కి కథను అందించిన
సంపత్ నంది ఈ
మూవీ ని నిర్మించబోతున్నాడు. ఇకపోతే "ఓదెల 2" లో
తమన్నా ప్రధాన పాత్రలో నటించబోతోంది. ఈ
మూవీ నిన్న అనగా
మార్చి 1 వ తేదీన
పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇప్పటికే ఓదెల రైల్వే స్టేషన్
మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో ఆ
మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న
మూవీ కావడంతో "ఓదెల 2" సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.