స్క్రిప్ట్ ల విషయంలో వరుణ్ పయనమెటో చూడాలి అంటున్న నెటిజన్స్..!!
'గని' అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తే భారీ షాక్ తగిలింది. ఇక 'గాండీవధారి అర్జున' అయితే ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా పెద్దగా ఎవరికీ తెలియలేదు. తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' కూడా అదే బాటలో పయనిస్తూ కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. విభిన్న జానర్స్ టచ్ చేస్తూ సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలనే వరుణ్ తేజ్ తపన మెచ్చుకోదగినదే.కానీ కేవలం జానర్, కాన్సెప్ట్ చూస్తే సరిపోదు. దానికి తగ్గ బలమైన స్క్రిప్ట్ తోడవ్వాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నా..పాజిటివ్ టాక్ తో నైనా చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తాయి. అయితే వరుణ్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటున్నాయి కానీ, మెప్పించేలా ఉండటం లేదని, హాఫ్ బేక్డ్ ఫిలిమ్స్ లా ఉంటున్నాయని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అందుకే అతని సినిమాలు కనీస వసూళ్లు రాబట్టలేక చతికిల పడుతున్నాయి. ప్రయోగాలు చేస్తే మంచి ఓపెనింగ్స్ రావడం కష్టమే.కానీ సినిమా బాగుంటే లాంగ్ రన్ లో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వరుణ్.. కేవలం సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపించడమే కాకుండా.. స్క్రిప్ట్ ల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.లేదా మిగతా మెగా హీరోలలా కమర్షియల్ బాట పట్టాలి. అలా అయితే మంచి ఓపెనింగ్స్ తో.. టాక్ తో సంబంధం లేకుండా కనీస వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఏది ఏమైనా వరుణ్ అయితే మారాల్సిన సమయం వచ్చింది. ఒకటి తన బాటలోనే పయనిస్తూ స్క్రిప్ట్ ల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి లేదా కమర్షియల్ బాట పట్టాలి. మరి వీటిలో వరుణ్ పయనమెటో చూడాలి.