షాకింగ్ కామెంట్స్ చేసిన పాపులర్ నటి ఆండ్రియా..!!
ఆమె ఎక్కువ తమిళ్ పరిశ్రమకే పరిమితి అయింది. అయితే సింగర్ గా నటిగా ఉన్న ఆండ్రియాకు గొడవలకు కొదవలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమాయణం నడిపింది. నటుడుతో సన్నిత సంబంధం వంటి ఎన్నో వివాదాలకి దిగింది. ఇక ప్రస్తుతం కొన్ని షాకింగ్ విషయాలను ఆండ్రియా బయట పెట్టింది. ఇంకొకసారి హాట్ టాపిక్ మారింది ఈ ముద్దుగుమ్మ. ఆండ్రియా మాట్లాడుతూ.. అప్పట్లో నా వయసు 11 సంవత్సరాలు నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో వెళుతున్నాను. నేను టీ షర్ట్ జీన్స్ మాత్రమే ధరించాను. మా నాన్న పక్కనే నేను కూర్చుని ఉన్నాను. అప్పుడు ఎవరో నా టీ షర్ట్ లోపల చెయ్యి వేసినట్లు అనిపించింది. నా టీషర్ట్ లో ఎవరో చేయి వేశారన్న ఊహ నేను భరించలేకపోయాను..
ఇక నేను భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి లేచి ఏమీ మాట్లాడకుండా భయంతో మా అమ్మ దగ్గర కూర్చుని ఈ విషయం ఎవరికీ చెప్పుకోవడానికి కారణమేమిటో నాకు అర్థం కాక నేను ఏడ్చేసాను. ఈ విధంగా తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటన లను పంచుకున్నారు. అలాగే ప్రేమపై పెళ్లిపై తన ఉద్దేశం ఏంటో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో అందరితో షేర్ చేసుకున్నారు. అబ్బాయిని ప్రేమించాలని అతనిని పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయ్యానని అన్నారు. కానీ చివరికి మోసపోయినట్లు తెలుసుకున్నారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా టైం కూడా పట్టింది అన్నట్లు ఎమోషనల్ అయ్యారు. తన మాటలతో నేటివిజన్లు మొత్తం నిశ్శబ్దంతో ఆమెకు ధైర్యం చెబుతూ ఆమె సపోర్ట్ గా నిలిచారు.