"శర్వా 37" అప్డేట్ ఈరోజు ఆ సమయానికి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కంటే ముందు వరుసగా అపజాయలను ఎదుర్కొన్న శర్వానంద్ ఈ సినిమా విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు  అవి పెద్దగా బయటకు రాలేదు.


ఇకపోతే శర్వా గత కొంత కాలంగా సామజవరగమన సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చేసింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం విడుదల చేసింది.


ఇకపోతే శర్వానంద్ , రామ్ అబ్బరాజు కాంబోలో రూపోందబోయే సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ మూవీ బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో "శర్వా 37" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: