జగన్ ప్రభుత్వంపై పూనమ్ కౌర్ ప్రశంసలు?

Purushottham Vinay
మాజీ సినీ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి కూడా ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి.అసలు సినిమా హీరోయిన్ గా ఆమె ఎంత పాపులర్ అనే విషయం కాసేపు పక్కనపెడితే...2014 లో టీడీపీ - జనసేన ఉమ్మడి ప్రభుత్వం సమయంలో ఆమె ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారనే విషయంపై కావాల్సినంత రచ్చ జరిగింది. అయితే ఆ సంగతి అలా ఉంటే ఆమె తాజాగా జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు."మాయాజాలం" అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన పూనమ్ కౌర్ ఆ తరువాత కాలంలో పలు తెలుగు, తమిళం, హిందీ, మళయాలం సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఆమె ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ టార్గెట్ గా నెట్టింట పెట్టే పోస్టులు బాగా వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి నేరుగా పేరు పెట్టి వాయించే ఆమె.. కొన్ని సార్లు పరోక్షంగా కూడా సెటైర్లు వేస్తుంటారు. వారు ఎవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి ఆమె ఎందుకు అలా చేస్తుందో ఎవరికీ అర్థం కాదు.


అయితే ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చేనేత కార్మికుల విషయంలో జగన్ ప్రభుత్వం అవలంభించిన వైఖరిపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఇందులో భాగంగా... "కోవిడ్ మహమ్మారి సమయంలో చేనేత కార్మికులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు  కూడా చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా నేను చెబుతున్నా.. ఇది చాలా గొప్ప విషయం" అని పూనమ్ కౌర్ X వేదికగా స్పందించింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ కింద కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ  పోస్ట్ కింద దర్శనమిస్తున్న కామెంట్లతో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.అప్పుడు కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభించిన సమయంలో చాలా రాష్ట్రాలు పేదలకు అందించే పథకాలను ఆపేయగా... ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమం ఆపకుండా ప్రజలకు అందించారనే ప్రశంసలు ఇతర రాష్ట్రాల నేతల నుంచి కూడా వినిపించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పూనమ్ కౌర్ కూడా ఇలా స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: