"లవ్ మీ" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు సోదరిడి కుమారుడు అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే రౌడీ బాయ్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.
 


ఈ మూవీ తర్వాత ఈయన సెల్ఫిష్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ తిరిగి ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సెల్ఫిష్ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో ఈ నటుడు ఆ గ్యాప్ లో "లవ్ మీ" అనే మరో మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ లో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది.


ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈ రోజు అనగా మార్చి 7 వ తేదీన సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: