మార్చి 17 న ఈటీవీలో ప్రసారమవుతున్న 'సైంధవ్' మూవీ...!!
'హిట్', 'హిట్ 2' లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్తో ఆకట్టుకున్న శైలేష్ కొలను 'సైంధవ్' కోసం మాఫియా, గ్యాంగ్ స్టర్ లాంటి అవుట్ డేటెడ్ లైన్ తీసుకుని దానికి ఓ మెకికల్ డ్రగ్ పాయింట్ తో పాటూ కూతురి సెంటిమెంటును జోడించాడు. ఓ సాదాసీదా జీవితాన్ని లీడ్ చేసే హీరోకి పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండడం అనేది గతంలోనే చాలా సినిమాల్లో వాడేసారు. సరే అదే పాయింట్ ని కొత్త క్యారెక్టరైజేషన్ తో కథ రాసుకున్నా దాన్ని హ్యాండిల్ చేయడంలో శైలేష్ కొలను తడబడ్డాడు. హీరోకు నెక్స్ట్ లెవెల్ ఫ్లాష్ బ్యాక్, అతనికి సపోర్ట్ గా నిలిచే కొన్ని క్యారెక్టర్స్, దీటైన విలన్స్.. ఇలా అన్నీ ఉన్న సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.హీరో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ సైకో పాత్ర నుంచి సైంధవ్ గా సాదాసీదా ఫ్యామిలీ మెంబర్ గా ఎందుకు మారాడనే అంశాన్ని సరిగ్గా చూపించలేదు. సినిమాలో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియాతో పాటు చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నా వాళ్ళని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. ఏదో పాన్ ఇండియా మార్కెట్ కోసమే వాళ్ళని తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇక సినిమాలో సైకోగా వెంకటేష్ అదరగొట్టేసారు. మరోసారి తనలోని మాస్ యాక్షన్ ని యాంగిల్ ని చూపించాడు. వెంకీ తర్వాత బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ విలనిజం ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకుని 'సైంధవ్' సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.