టాటూ హైలెట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చిన మంచు లక్ష్మి...!!
ఇక మంచు లక్ష్మి కెరీర్ అమెరికాలో మొదలైంది. అనే హోస్ట్ గా కొన్ని టాక్ షోలు చేసింది. అలాగే రెండు మూడు ఇంగ్లీష్ మూవీస్ లో నటించింది. ఎందుకో సడన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అనగనగా ఒక ధీరుడు చిత్రంలో లేడీ విలన్ పాత్ర చేసింది. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా చేసింది. అటు నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించింది.ఎక్కడా మంచు లక్ష్మికి కలిసి రాలేదు. ఇటీవల మంచు లక్ష్మి తన మకాం బాలీవుడ్ కి మార్చింది. ముంబై లో ఒక లగ్జరీ హౌస్ అద్దెకు తీసుకుని నివసిస్తుంది. బాలీవుడ్ లో రాణించాలి అనేది ఆమె ప్రస్తుత లక్ష్యం అట. టాలీవుడ్ లో విఫలం చెందిన మంచు లక్ష్మి హిందీ చిత్ర పరిశ్రమలో ఈ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మికి బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో పాటు బాలీవుడ్ ప్రైవేట్ పార్టీల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల రకుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే…