అవకాశాలు లేక కొన్నాళ్ళ నుంచి సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది సమంత. ఆమె చివరగా ఖుషి సినిమాలో కనిపించింది. ఇందులో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత తన మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది.ఇమ్యూనిటి బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్ ఇటీవలే ఇండియా తిరిగి వచ్చింది. చేతిలో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటుందిసామ్. ఇటీవలే TAKE 20 పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసింది సామ్. ఇందులో తాను మయోసైటిస్ వల్ల ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు.. కోలుకున్న విధానం గురించి చాలా విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.ఇక ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది సామ్. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి యంగ్ టాలెంట్స్ ఎంకరేజ్ చేసే పనిలో పడింది సమంత.అయితే సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఎప్పుడూ హాట్ హాట్ టాపిక్ గా నిలుస్తూ తెగ వైరలఉతుంటాయి. అవి కూడా ట్రోల్స్ వల్ల వైరల్ అవుతాయి.ఇక తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది సామ్.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫెమినా మ్యాగజైన సామ్ ఫోటోను సామ్ పబ్లిష్ చేసింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా ఆమె తెలిపింది. సమంత ఓ ప్రకృతి శక్తి.. ఏ మాయ చేశావే లోని జెస్సీ పాత్ర నుంచి సిటాడెల్ సిరీస్ లో ఆమె పోషించిన పాత్ర వరకు సమంత జర్నీ దేశంలోని మహిళలకు స్పూర్తినిస్తుందంటూ ఫెమినా కూడా పోస్ట్ చేసింది. సమంత షేర్ చేసిన ఫోటోస్ లో ఆమె లుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు ఎంతో ముద్దుగా కనిపించినా సామ్..ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.ఏది ఏమైనా సామ్ నాగ చైతన్యతో విడాకుల తరువాత తన అందం అంతా పోగొట్టుకుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోపై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఎవరు నువ్వు ఇలా వున్నావు ఏంటని తెగ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది సమంత ఫ్యాన్స్ తను ఇంకా విడాకుల బాధ నుంచి కోలుకోలేదని అందువల్లే తను ఇలా అయిపోయిందని సామ్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఆమె మునుపటి విధంగా క్యూట్ గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.