ఇంతలా మారిపోయిన హనీ రోజ్..!!
హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు కేవలం ఒకే ఒక్క సినిమాతో తన మాయలో కుర్రకారులను పడేలా చేసింది మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ గతంలో రెండు మూడు చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకుంది.. చూడడానికి కాస్త ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అప్పట్లో సన్నజాజిలాగా కాస్త యావరేజ్ గా ఉండేది.. కానీ ఇప్పుడు కుందనపు బొమ్మల మారిపోయింది అంటూ అభిమానులు సైతం అప్పటి ఫోటోను చూసి ఆ చర్యపోతున్నారు.
బాలయ్య వీర సింహారెడ్డి చిత్రంలో తెలుగులో నటించి మళ్లీ రి ఎంట్రి ఇచ్చిన కూడా ఆ తర్వాత ఏ చిత్రాలలో నటించలేదు.. ప్రస్తుతానికైతే కన్నడలోని కొన్ని చిత్రాలలో నటిస్తోందని అలాగే తెలుగులో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా అవకాశాలు అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది హని రోజు.. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ భారీగానే సంపాదిస్తోంది.. సినిమాలలో కంటే సోషల్ మీడియా ద్వారా షాపింగ్ మాల్స్ ద్వారానే భారీగానే సంపాదిస్తోంది హినీ రోజ్.. అయితే గతంలో ఉన్న ఫోటోను చూసి అందరూ సైతం ఆశ్చర్యపోతున్నారు..