ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "ఊరు పేరు భైరవకోన"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమా లలో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సాధించాయి. ఇకపోతే ఎప్పుడు రెగ్యులర్ ఫార్మేట్ కమర్షియల్ సినిమాలలో నటించడం కాకుండా హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ నటుడు ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. దానితో ఈయనకు సక్సెస్ రేట్ తక్కువే ఉన్నప్పటికీ నటుడుగా మాత్రం మంచి గుర్తింపు ప్రేక్షకుల్లో ఉంది.


ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వర్ష బోల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ సడన్ గా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: