వాళ్లలో కొంతమందికి నా పేరు కూడా తెలియదు... గోపీచంద్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో హీరో గా , విలన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గోపీ చంద్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఒక సినిమాలో హీరో గా నటించాడు. ఆ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచింది. ఆ తర్వాత ఈయనకు సినిమాల్లో హీరో అవకాశాలు రాలేదు. అలాంటి సమయం లోనే తేజ దర్శకత్వంలో రూపొందిన జయం సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో గోపీ చంద్ తన వీలనిజంతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో వరుసగా ఈయనకు తెలుగు సినిమాల్లో విలన్ అవకాశాలు దక్కాయి.


అందులో భాగంగా వర్షం , నిజం సినిమాలలో విలన్ పాత్రలలో నటించాడు. ఇక ఆ తర్వాత మళ్లీ హీరో పాత్రలలో నటించినా గోపిచంద్ ఇప్పటి వరకు వరుసగా హీరో గానే సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన బీమా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇకపోతే తాజాగా గోపీచంద్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా గోపీచంద్ కు మీరు చాలా మందికి చదువు చెప్పిస్తున్నారట ..? అది బయటికి చెప్పకుండా ఎందుకు దాచేస్తున్నారు అనే ప్రశ్న ఎదురైంది.


దానికి గోపీ చంద్... అవును నేను నిజంగానే చాలా మందికి చదువు చెప్పిస్తున్నాను. నేను చదువు చెప్పిస్తున్న కొంత మంది కి నా పేరు కూడా తెలియదు. ఇప్పటికే నేను చదువు చెప్పించిన వారిలో కొంత మంది ఉద్యోగాల్లో కూడా చేరారు. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. మా చిన్నప్పుడు ఒంగోలు లో ఆయన ఓ స్కూల్ ను పెట్టారు. ఆయన మృతి తర్వాత దాన్ని నడపలేకపోయాం. బాగా చదువుకునే వారికి ఇప్పుడు నేను సహాయం చేస్తున్న అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: