పేరు మార్చుకున్న సాయి ధరమ్, నెక్స్ట్ మల్టీస్టారర్ ఆ హీరోతోనే...!!!
ఇకపోతే సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయాలు వస్తే.. సాయి ధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ సత్య. తాజాగా దీని ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తేజ్. నా లైఫ్ లో ముగ్గురు సత్యలు ఉన్నారు. మా అమ్మ, పిన్ని, అమ్మమ్మ అంజనాదేవి. వాళ్లు నన్ను దగ్గరకు తీసుకుని ఎంతో ఆప్యాయంగా పెంచారు. వాళ్లను నేను సంతోషంగా ఉంచడం తప్ప ఇంకేమీ చేయలేను. నేను గొప్పగా ఉంటే వాళ్లకే సంతోషం అని ఎమోషనల్ అయ్యాడు తేజ్. ఇక యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ నటించిన విరూపాక్ష, బ్రో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు సాయి దుర్గ తేజ్.అయితే సాయి ధరమ్ తేజ్, స్వాతి కలిసి గతంలో నవీన్ దర్శకత్వంలో సత్య అనే ఓలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మన అందరికి తెలిసిందే. సాయి ధరమ్ తేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు సాయి తేజ్. షార్ట్ ఫిలిం చేశారు. ఆల్రెడీ సత్య షార్ట్ ఫిలిం నుంచి సాంగ్ రిలీజ్ చేసి మెప్పించారు. నిన్న ఉమెన్స్ డే సందర్భంగా ఈ షార్ట్ ఫిలిమ్ కొంతమందికి ప్రీమియర్ వేసి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఇందులో భాగంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేశారు, మీ ఫ్యామిలిలో రామ్ చరణ్ గారితో లేదా ఇంకెవరితోనైనా మల్టీస్టారర్ చేస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడగగా తేజ్ సమాధానమిస్తూ.. ఆల్రెడీ నాగబాబు, పవన్ మామలతో కలిసి నటించాను. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి మామ. ఆయనతో కలిసి నటించాకే మిగిలిన వాళ్ళతో కూడా అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను అని తెలిపారు.దీంతో సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. జవాన్ సినిమాలో నాగబాబు – తేజ్ కలిసి నటించారు. ఇక బ్రో సినిమాలో పవన్ – తేజ్ ఫుల్ లెంగ్త్ కలిసి నటించారు. నెక్స్ట్ చిరంజీవితో తేజ్ ఏ సినిమాలో కనిపిస్తాడో చూడాలి.